

ఆంధ్రప్రదేశ్‌కు కీలకమైన పోలవరం సాగునీటి ప్రాజెక్టు ఫేజ్-1 పనుల పూర్తికి కేంద్రం మరో ఏడాది గడువు పొడిగించింది. ఫేజ్-1కు సంబంధించిన సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి ఫేజ్-1 లక్ష్యాలను సాధించేందుకు తాజా గడువు మరింత సమయం కల్పించనుంది. సవరించిన అంచనాలకు ఆమోదం లభించడం ప్రాజెక్టు పనుల కొనసాగింపుతో పాటు నిధుల పరంగా కూడా కీలక పరిణామంగా భావిస్తున్నారు.
2021 నుంచి 2026 మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టుకు మొత్తం రూ.12,620.53 కోట్లు విడుదలైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరో ఏడాది గడువు పొడిగింపుతో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం లభించనుంది. సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం తెలపడంతో ప్రాజెక్టు నిర్మాణం, నిధుల సమీకరణకు సంబంధించి మరింత స్పష్టత ఏర్పడనుంది. పోలవరం పూర్తితో రాష్ట్రంలోని సాగునీరు, తాగునీరు, నీటి నిర్వహణ రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!