
సినిమాలు

తెలంగాణ బీజేపీ చేపట్టనున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ‘ఫీజు బకాయి – బీజేపీ లడాయ్’ పేరుతో రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద రెండు రోజుల పాటు దీక్ష నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షకు ఏర్పాట్లు చేసింది.
అయితే పార్టీ కార్యాలయం వద్ద దీక్ష నిర్వహిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల అనుమతి ఉన్నా లేకపోయినా దీక్ష నిర్వహించి తీరుతామని బీజేపీ నేతలు, కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. దీంతో దీక్ష విషయంలో ప్రభుత్వం, బీజేపీ మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొనే అవకాశం కనిపిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!