

పోలవరం ముంపు కారణంగా తెలంగాణ గ్రామాలకు పొంచి ఉన్న ప్రమాదంపై మాజీ మంత్రి, ఉప సభాపక్ష నాయకుడు హరీశ్ రావు పోలవరం ప్రాజెక్టు ప్రాధికార సంస్థకు లేఖ రాశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజల ప్రాణాలు, జీవనోపాధి, వ్యవసాయ భూముల రక్షణ కోసం ఆయన తీసుకున్న చొరవను ప్రాధికార సంస్థ అభినందించింది. ముంపు సమస్యను అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.
2025 ఏప్రిల్ 8న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారుల మధ్య జరిగిన సమావేశ నిర్ణయాలను ప్రాధికార సంస్థ మరోసారి గుర్తు చేసింది. పోలవరం గరిష్ట నీటిమట్టం 45.72 మీటర్లు కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను పటిష్టమైన ఇంజనీరింగ్ చర్యలతో రక్షిస్తామని తెలిపింది. అది సాధ్యం కాకపోతే భూసేకరణ చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రివర్గ ఆమోదం మేరకు ప్రస్తుతం మొదటి దశలో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తున్నట్లు వెల్లడించింది. తెలంగాణకు ఎలాంటి నష్టం జరగకుండా తగిన వరద నివారణ చర్యలు చేపట్టాలని హరీశ్ రావు కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!