
ఓటీటీ

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు యంగ్ ప్రొఫెషనల్స్ (YP) నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థ, పబ్లిక్ పాలసీ, డేటా అనలిటిక్స్, సాంకేతిక రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతకు ఈ కార్యక్రమం ద్వారా అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. దేశ ఆర్థిక విధానాల రూపకల్పనకు తోడ్పడే ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేయడమే ఈ నియామకాల ప్రధాన లక్ష్యం.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.5 లక్షల స్థిర స్టైఫండ్ అందించబడుతుంది. ఈ నియామకాలు ఒప్పంద ప్రాతిపదికన ఉండగా, ఎంపికైన వారు ముంబైలోని ఆర్బీఐ సెంట్రల్ ఆఫీస్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతిష్ఠాత్మక సంస్థలో పని చేసే అవకాశంతో పాటు విలువైన అనుభవాన్ని పొందేందుకు ఇది యువతకు మంచి అవకాశం కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!