

మాజీ నిజాం కుటుంబానికి చెందిన ప్రిన్స్ అజ్మత్ జా, మరో వ్యక్తి దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. న్యాయమూర్తి జస్టిస్ పి. సామ్ కోశీ సెప్టెంబర్ 18న ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ఐదు ఆస్తుల విభజన, ప్రత్యేక స్వాధీనం కోరుతూ దాఖలైన దావాలో కింగ్ కోఠి, నజ్రీబాగ్ ఆస్తికి సంబంధించి 2018లో నమోదైన విక్రయ పత్రాన్ని చెల్లదని ప్రకటించాలని కూడా వాది కోరారు.
వాది స్థిర కోర్టు ఫీజు చెల్లించగా, ఆస్తులపై మొదటి ప్రతివాదికి ప్రత్యేక స్వాధీనం ఉన్నట్లు దావాలోనే పేర్కొన్నందున తన వాటా మార్కెట్ విలువ ఆధారంగా కోర్టు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పిటిషనర్లు వాదించారు. అయితే వాది సహ వాటాదుడా, ఉమ్మడి స్వాధీనంలో ఉన్నారా, ఏ నిబంధన ప్రకారం కోర్టు ఫీజు చెల్లించాలన్న అంశాలను వాదనలు, సాక్ష్యాల ఆధారంగా విచారణ సమయంలోనే నిర్ణయించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 227 కింద జోక్యం చేసుకునే కారణాలు కనిపించడం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!