

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నేతలపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. కట్ మనీ పేరుతో తమ వద్ద నుంచి బలవంతంగా వసూలు చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నేత బ్రహ్మానంద్ చక్రవర్తిని అరెస్టు చేయడానికి పోలీసులు వెళ్లగా, ఆయన హౌరాలోని ఓ దుకాణంలో చీరల కింద దాక్కున్నట్లు సమాచారం. అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
మాతాభంగా పురపాలక సంఘానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు కకాలి ఘోష్ ప్రజలకు డబ్బు తిరిగి చెల్లించడం ప్రారంభించారు. తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానికులు తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యుడు మదన్ మిత్రా కారుపై గుడ్లతో దాడి చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నేత జయ ప్రకాష్ మజుందార్, మాజీ మంత్రి స్వరూప్ దాస్‌లపై కూడా ప్రజలు గుడ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య సతీమణి మీరా, ముఖ్యమంత్రి సువేందు పనితీరును ప్రశంసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!