
జనరల్

ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో లోకల్ రైళ్ల రాకపోకలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల రైళ్లు సుమారు 30 నిమిషాల ఆలస్యంగా నడవడంతో బోరివళి సహా ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రైళ్ల ఆలస్యంతో ప్లాట్‌ఫారమ్‌లపై భారీ రద్దీ నెలకొనడంతో ప్రయాణికులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలంలో కూడా లోకల్ రైళ్లు అంతరాయం లేకుండా నడిచేలా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, రైల్వే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!