
జనరల్

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నేటి నుంచి రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ‘ఫీజుల బకాయి బీజేపీ లడాయి’ పేరుతో నిర్వహించనున్న ఈ దీక్ష సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.
పార్టీ కార్యాలయం వెలుపల దీక్ష చేపట్టేందుకు అనుమతి లభించకపోవడంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం లోపలే రామచందర్ రావు నిరాహార దీక్ష చేయనున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేయనున్నారు. దీక్షకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు మద్దతు తెలపనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!