

భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్, వర్ల కుమార్ రాజా, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం సీపీ రాధాకృష్ణన్ గన్నవరం నుంచి నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరుకు బయలుదేరారు.
ముసునూరులో గౌర్మెంట్ పాప్‌కార్నికా రూపొందించిన నూతన హైబ్రిడ్ వంగడాన్ని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కలిసి మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. వ్యవసాయ రంగంలో కొత్త వంగడాల ప్రోత్సాహం, రైతులకు ప్రయోజనం చేకూర్చే సాంకేతికతపై ఈ కార్యక్రమంలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!