

రుణ వసూళ్ల పేరుతో రికవరీ ఏజెంట్లు చేసే వేధింపులు, బెదిరింపులకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం రుణ వసూళ్ల కోసం ఏజెంట్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే రుణగ్రహీతలను సంప్రదించాలి. బెదిరింపులు, అసభ్య పదజాలం, అనామక కాల్స్, బహిరంగంగా అవమానించడం, కుటుంబ సభ్యులను భయపెట్టడం వంటి చర్యలను అనుమతించరు. రుణ వసూళ్ల సమయంలో రుణగ్రహీతల గౌరవం, గోప్యతను కాపాడాల్సిన బాధ్యత రుణ సంస్థలపై ఉంటుంది.
ఇంటి వద్దకు రికవరీ ఏజెంట్లను పంపించే ముందు రుణగ్రహీతకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఏజెంట్లు తమ గుర్తింపు, అధీకృత పత్రాలను చూపించాలి. రుణగ్రహీతల ఫొటోలు, వీడియోలు, ఆడియోలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో దుర్వినియోగం చేయడం కూడా నిషేధం. రుణ వసూళ్లను ఔట్‌సోర్స్ చేసినప్పటికీ, ఏజెంట్ల చర్యలకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలే బాధ్యత వహించాలి. అలాగే ఈఎంఐపై కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లను బాకీ చెల్లించని సందర్భాల్లో రిమోట్‌గా పరిమితం చేయడానికీ ఆర్‌బీఐ ప్రత్యేక షరతులు విధించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!