

తమ పోస్టులకు గతంలో మాదిరిగా వ్యూస్ రావడం లేదని కొందరు ఎక్స్ యూజర్లు తరచూ ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. అయితే పోస్టులపై ప్రభుత్వాల నుంచి వచ్చిన అభ్యర్థనలు, దేశాల వారీగా విధించే ఆంక్షలు కూడా దీనికి ఒక కారణం కావచ్చు. నిర్దిష్ట దేశాల్లో చట్టపరమైన అభ్యర్థనల మేరకు పోస్టులు లేదా అకౌంట్లను నిలిపివేయాల్సి రావచ్చని ఎక్స్ అధికారికంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షల గురించి యూజర్లు తెలుసుకునేలా ‘అండర్ ది హుడ్’ ఫీచర్‌ను ఎక్స్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా తమ పోస్టులపై ఏయే దేశాల్లో ఆంక్షలు విధించబడ్డాయో, వాటి కారణంగా వ్యూస్ తగ్గాయా లేదా అనే విషయంపై మరింత స్పష్టత పొందవచ్చు.
ఈ ఫీచర్ ద్వారా గత నెలలో తమ పోస్టులపై విధించిన ఆంక్షలకు సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం ఉందని ఎక్స్ తెలిపింది. వెబ్‌లో ఉపయోగించాలంటే ఎక్స్‌లోని సంబంధిత ‘అండర్ ది హుడ్’ పేజీని సందర్శించాలి. యాప్‌లో ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ‘సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ’లోకి వెళ్లి, ‘యువర్ అకౌంట్’లోని ‘అండర్ ది హుడ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం గత నెల నివేదికను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం అన్ని ఖాతాలకు అందుబాటులో ఉండదని పేర్కొంది. కనీసం ఏడాది క్రితం సృష్టించిన ఖాతాలతో పాటు, గత నెలలో కనీసం పది పోస్టులు చేసిన యూజర్లకే ఈ నివేదిక అందుబాటులో ఉంటుందని సమాచారం.
ఈ ఫీచర్‌ను పారదర్శకతను పెంచే చర్యల్లో భాగంగా ఎక్స్ విస్తరిస్తోంది. ప్రభుత్వాల నుంచి చట్టబద్ధమైన అభ్యర్థనలు అందినప్పుడు నిర్దిష్ట దేశాల్లో కంటెంట్‌ను నిలిపివేయవచ్చని ఎక్స్ తన అధికారిక మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే పోస్టులకు వ్యూస్ తగ్గడానికి ప్రభుత్వ ఆంక్షలే ఏకైక కారణం కావని, ఎక్స్‌లోని రీచ్ పరిమితులు పాలసీ ఉల్లంఘనలు, యూజర్ నియంత్రణలు, ప్రయోగాత్మక మార్పులు, సాంకేతిక సమస్యలు వంటి ఇతర కారణాల వల్ల కూడా ఉండవచ్చని సంస్థ వివరిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!