

హైదరాబాద్‌లోని మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చంచల్‌గూడ డబుల్ బెడ్‌రూమ్ ప్రాంగణంలో వినాయక అన్నదాన కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆదివారం హిందూ భక్తులు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో మహ్మద్ ఇమ్రాన్ ఖురేషి, ఆయేషా బేగం దంపతులు మాంసం విసిరినట్లు ఆరోపణలు రావడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పలు హిందూ సంఘాల ప్రతినిధులు అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.
ఘటనపై సమాచారం అందుకున్న చార్మినార్ డీసీపీ కిరణ్ ప్రభాకర్ ఖరే అక్కడికి చేరుకుని నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మాదన్నపేట పోలీసులు మహ్మద్ ఇమ్రాన్ ఖురేషి, ఆయేషా బేగంలను అరెస్టు చేసి నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!