

పునరుత్పాదక ఇంధన రంగం భారత్‌కు భారీగా ఆర్థిక ప్రయోజనాలను అందిస్తోంది. 2011 నుంచి 2025 మధ్య కాలంలో రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా దేశానికి సుమారు 100 బిలియన్ డాలర్లు ఆదా అయినట్లు అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ మార్కెట్ రిపోర్ట్ 2026లో ఈ వివరాలను పొందుపరిచింది. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరగడం వల్ల సంప్రదాయ ఇంధనాలు, ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇంధనాలపై భారత్ ఆధారపడటం తగ్గుతోందని నివేదిక పేర్కొంది. దీనివల్ల దేశానికి గణనీయమైన ఆర్థిక ఆదా లభిస్తున్నట్లు తెలిపింది.
2030 నాటికి పునరుత్పాదక ఇంధనం ద్వారా భారత్‌కు లభించే మొత్తం ఆర్థిక ప్రయోజనాలు 240 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని ఐఈఏ అంచనా వేసింది. రాబోయే సంవత్సరాల్లో స్వచ్ఛమైన ఇంధన వనరుల విస్తరణ దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత మేలు చేయనుందని నివేదిక వెల్లడించింది. రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా విదేశీ ఇంధనాలపై ఆధారపడటాన్ని మరింత తగ్గించడంతో పాటు ఇంధన భద్రతను బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుందని వివరించింది. దేశ దీర్ఘకాలిక ఇంధన అవసరాలను తీర్చడంలో పునరుత్పాదక ఇంధనం కీలక పాత్ర పోషించనుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!