10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో పీఆర్టీ, రహదారుల అభివృద్ధికి వేగం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Writer: Harika S 11:16 PM, 9 అక్టోబర్, 2026
హైదరాబాద్‌లో పీఆర్టీ, రహదారుల అభివృద్ధికి వేగం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా రవాణా, రహదారుల అనుసంధానత, రీసైకిల్డ్ వాటర్ వినియోగంపై నిర్వహించిన సమీక్షలో హైదరాబాద్‌లో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (PRT) వ్యవస్థ ఏర్పాటుపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. అధిక సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాలతో పాటు పారిశ్రామిక ప్రాంతాలను మెట్రో, ఎంఎంటీఎస్, బస్ స్టేషన్లతో అనుసంధానించేలా పీఆర్టీని రూపొందించాలని సీఎం సూచించారు. ప్రపంచంలోని అత్యుత్తమ పీఆర్టీ వ్యవస్థలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని, అనువైన ప్రాంతాల ఎంపిక, ఆధునిక సాంకేతికత, నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానం ద్వారా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని సూచించారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్ వైపు ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలని, యుటిలిటీల తరలింపును త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ముంబై వంటి నగరాల్లో అనుసరిస్తున్న నిర్మాణ సాంకేతికతను అధ్యయనం చేసి, సాధ్యమైన చోట పనులను ఏడాదిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్ మార్గానికి సమాంతరంగా రేడియల్ రోడ్డు నిర్మించే అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. శంకర్‌పల్లి–చేవెళ్ల మధ్య ప్రస్తుత రహదారుల విస్తరణతో పాటు కొత్త రహదారుల నిర్మాణ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని తెలిపారు. రీసైకిల్డ్ వాటర్ వినియోగానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని, 500 ఎంఎల్‌డీ నీటి వినియోగానికి రూపొందించిన ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్‌వల్లి, ఆలూరులోని డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలకు రీసైకిల్డ్ వాటర్ అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎత్తైన భవనాలు, ల్యాండ్‌స్కేప్ ప్రాంతాలు, పార్కుల్లోనూ ఈ నీటిని వినియోగించేలా చూడాలని సూచించారు. క్యూర్ చట్టం అమలులో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు, హైడ్రా, వాటర్ బోర్డు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల కార్యాలయాల పనులను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సలహాదారు ఎన్‌వీఎస్ రెడ్డి, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ రెడ్డి, పలువురు కార్పొరేషన్ల కమిషనర్లు, వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బతుకమ్మ సంబరాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు!

బతుకమ్మ సంబరాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు!

న్యూఢిల్లీలో 24 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ బంద్!

న్యూఢిల్లీలో 24 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ బంద్!

వరల్డ్ పోస్ట్ డే వేళ ఢిల్లీ పోలీసుల భావోద్వేగ సందేశం.. మానవత్వమే ముఖ్యమంటూ పోస్ట్!

వరల్డ్ పోస్ట్ డే వేళ ఢిల్లీ పోలీసుల భావోద్వేగ సందేశం.. మానవత్వమే ముఖ్యమంటూ పోస్ట్!

ముగిసిన ఇండియా కూటమి ఎంపీల భేటీ.. విజయ్ చౌక్‌కు ర్యాలీగా నేతలు!

ముగిసిన ఇండియా కూటమి ఎంపీల భేటీ.. విజయ్ చౌక్‌కు ర్యాలీగా నేతలు!

టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్!
ట్యాగ్లు
రేవంత్ రెడ్డిహైదరాబాద్ అభివృద్ధిక్యూర్పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్హైదరాబాద్ ట్రాఫిక్రహదారుల అభివృద్ధిరీసైకిల్డ్ వాటర్తెలంగాణ ప్రభుత్వంమెట్రో అనుసంధానత
AdvertisementAdvertisement

టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్!

జమాత్ ఆదేశిస్తే చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేస్తా: అక్బరుద్దీన్ ఒవైసీ

జమాత్ ఆదేశిస్తే చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేస్తా: అక్బరుద్దీన్ ఒవైసీ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు.. రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి విమర్శలు
రాజకీయాలు

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు.. రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి విమర్శలు

హైదరాబాద్‌లో పీఆర్టీ, రహదారుల అభివృద్ధికి వేగం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

హైదరాబాద్‌లో పీఆర్టీ, రహదారుల అభివృద్ధికి వేగం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

బిగ్‌బాస్ హౌస్‌లో ఆ రెండు జంటలపై ట్రోలింగ్.. షాలిని, వర్షిణి తీరుపై చర్చ!
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లో ఆ రెండు జంటలపై ట్రోలింగ్.. షాలిని, వర్షిణి తీరుపై చర్చ!

ధర్మన్ దర్శకుడితో రజనీకాంత్‌కు విభేదాలా? వైరల్ వార్తలపై టీమ్ క్లారిటీ
సినిమాలు

ధర్మన్ దర్శకుడితో రజనీకాంత్‌కు విభేదాలా? వైరల్ వార్తలపై టీమ్ క్లారిటీ

భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం...
క్రీడలు

భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం...

విండీస్‌పై టీమిండియా విధ్వంసం.. సంజూ శాంసన్ మెరుపులు!
క్రీడలు

విండీస్‌పై టీమిండియా విధ్వంసం.. సంజూ శాంసన్ మెరుపులు!

రుద్రమదేవిలో గోన గన్నారెడ్డిగా బన్నీ.. 11 ఏళ్ల తర్వాత వైరల్‌గా మారిన పోస్ట్!
సినిమాలు

రుద్రమదేవిలో గోన గన్నారెడ్డిగా బన్నీ.. 11 ఏళ్ల తర్వాత వైరల్‌గా మారిన పోస్ట్!

తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
రాజకీయాలు

తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

ఓటీటీ కోసం ది ప్యారడైజ్‌లో మార్పులు.. నాని బోల్డ్ డెసిషన్‌పై ఆసక్తి!
గాసిప్స్

ఓటీటీ కోసం ది ప్యారడైజ్‌లో మార్పులు.. నాని బోల్డ్ డెసిషన్‌పై ఆసక్తి!

జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
సినిమాలు

జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

బతుకమ్మ సంబరాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు!
జనరల్

బతుకమ్మ సంబరాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు!

వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా!
సినిమాలు

వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!