
బిజినెస్

నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం తెలంగాణలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా 8వ నెలలోనూ దేశంలోనే అత్యధికంగా నమోదైంది. జనవరి నుంచి ఆగస్టు వరకు ప్రతి నెలా అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రంగా తెలంగాణ కొనసాగింది. దీంతో నిత్యావసర వస్తువులు, గృహ ఖర్చులపై ధరల ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
ఆగస్టులో తెలంగాణ గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలిపిన రిటైల్ ద్రవ్యోల్బణం 6.27 శాతంగా నమోదైంది. ఇది సుమారు 4 శాతంగా ఉన్న జాతీయ సగటు కంటే గణనీయంగా ఎక్కువ. తర్వాతి స్థానాల్లో తమిళనాడు 5.92 శాతం, మధ్యప్రదేశ్ 5.55 శాతం, ఆంధ్రప్రదేశ్ 5.53 శాతం, ఒడిశా 5.52 శాతంతో ఉన్నాయి. ఈ గణాంకాలు తెలంగాణలో వినియోగదారులపై ధరల ఒత్తిడి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్న పరిస్థితిని వెల్లడిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!