
సినిమాలు

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారం ఏసీబీ పరిధిలోకి రాదని పేర్కొన్నారు. 2015లో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం లంచం ఇవ్వడం నేరం కాదని, 2018లో అవినీతి నిరోధక చట్టంలో చేసిన సవరణల తర్వాత లంచం ఇవ్వడాన్ని కూడా నేరంగా పరిగణించేలా నిబంధనలు మారాయని వాదించారు.
ఈ కేసును ఎన్నికల కోడ్ నిబంధనల కింద విచారించాలని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్నది. దాదాపు గంటన్నర పాటు విచారణ సాగగా.. తదుపరి వాదనలు మధ్యాహ్నం కొనసాగనున్నాయి. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యకు సంబంధించిన పిటిషన్లు సుప్రీంకోర్టు రికార్డుల్లోనూ నమోదై ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!