2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..

Writer: Chandrika 10:46 PM, 17 ఆగస్టు, 2026
సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..

సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ హయాంలో ఈ ఆసుపత్రికి రూపకల్పన జరిగిందని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలుదిశలా టిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. సనత్‌నగర్ టిమ్స్‌లో 1,000 పడకలు, 300 ఐసీయూ బెడ్లు, 16 ఆపరేషన్ థియేటర్లు, అవయవ మార్పిడి విభాగంతో పాటు ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ఎక్స్‌రే, క్యాథ్ ల్యాబ్స్, రేడియాలజీ, డయాలసిస్ వంటి అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

సనత్‌నగర్ టిమ్స్ హైదరాబాద్ వాసులతో పాటు జిల్లాల నుంచి అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఆసుపత్రి నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 350 బస్తీ దవాఖానాలతో పాటు 4,000 పడకల కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ సౌకర్యంతో 1,200 ఎమర్జెన్సీ బెడ్లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అయితే రాజకీయ కారణాలతో టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభంలో జాప్యం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన కేటీఆర్.. అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అతిపెద్దదిగా నిర్మిస్తున్న 2,000 పడకల వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు హైదరాబాద్‌లోని నిమ్స్ విస్తరణ పనులను కూడా వేగవంతం చేయాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

ట్యాగ్లు
కేటీఆర్సనత్‌నగర్ టిమ్స్టిమ్స్ ఆసుపత్రితెలంగాణ వైద్యంహైదరాబాద్ ఆసుపత్రులుబీఆర్ఎస్కేసీఆర్సనత్‌నగర్ ఆసుపత్రితెలంగాణ రాజకీయాలువైద్య రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
జనరల్

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.
జనరల్

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్
జనరల్

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు
జనరల్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్
జనరల్

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన
జనరల్

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ
జనరల్

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు
జనరల్

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ
బిజినెస్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!