31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

Writer: Nithish 06:54 AM, 31 జులై, 2026
ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ఆస్తి పత్రాలను పోగొట్టిన కేసులో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ)కు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ జరిమానా విధించింది. ఫిర్యాదుదారుడు బి. వెంకటేశంకు రూ.3 లక్షల పరిహారంతో పాటు కేసు ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఇబ్రహీంపట్నం బొంగులూరుకు చెందిన వెంకటేశం ఎస్బీఐ ఆదిభట్ల శాఖ నుంచి రూ.5 లక్షల గృహ రుణం తీసుకుని, అదనపు గ్యారంటీగా బైరామల్‌గూడలోని 194 చదరపు గజాల ప్లాట్‌కు సంబంధించిన ఒరిజినల్‌ సేల్‌ డీడ్‌, లింక్‌ డాక్యుమెంట్లను బ్యాంకులో జమ చేశారు.

2022 మార్చిలో రుణం పూర్తిగా చెల్లించిన అనంతరం నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ తీసుకున్న వెంకటేశం, తన ఒరిజినల్‌ పత్రాలను తిరిగి ఇవ్వాలని బ్యాంకును కోరారు. అయితే పత్రాలు పోయాయని చెప్పి బ్యాంకు సర్టిఫైడ్‌ కాపీలు మాత్రమే అందించింది. దీంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని, ప్రత్యామ్నాయ పత్రాలు ఇచ్చామని బ్యాంకు వాదించినప్పటికీ, రుణ ఖాతా వెంకటేశం పేరుతో ఉన్నందున ఆయనకు పరిహారం పొందే హక్కు ఉందని కమిషన్‌ పేర్కొంది. బ్యాంకు నిర్లక్ష్యం కారణంగానే నష్టం జరిగిందని స్పష్టం చేస్తూ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి

ట్యాగ్లు
ఎస్బీఐవినియోగదారుల కమిషన్ఆస్తి పత్రాలుబ్యాంకు నిర్లక్ష్యంరంగారెడ్డిగృహ రుణంపరిహారంవినియోగదారుల హక్కులున్యాయ వార్తలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కామన్వెల్త్‌లో భారత్‌ పతకాల వేట.. లవ్‌ప్రీత్‌కు రజతం, సీమకు కాంస్యం
క్రీడలు

కామన్వెల్త్‌లో భారత్‌ పతకాల వేట.. లవ్‌ప్రీత్‌కు రజతం, సీమకు కాంస్యం

మోదీపై నటుడు సుదేశ్ బెర్రీ ప్రశంసలు
సినిమాలు

మోదీపై నటుడు సుదేశ్ బెర్రీ ప్రశంసలు

అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం
టెక్నాలజీ

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా
బిజినెస్

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం
టెక్నాలజీ

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా
జనరల్

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌
జనరల్

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు
జనరల్

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం
రాజకీయాలు

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ
టెక్నాలజీ

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
రాజకీయాలు

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!