
షోస్

జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతున్నట్లు టీఎంసీ రెబల్ ఎంపీ బసునియా సంచలన ప్రకటన చేశారు. 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు త్వరలో బీజేపీలో చేరనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఎన్‌సీపీలోని ముగ్గురు ముస్లిం ఎంపీలు మాత్రం ఆ పార్టీలోనే కొనసాగుతారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
17 మంది ఎన్‌సీపీ ఎంపీలు బీజేపీలో చేరితే లోక్‌సభలో బీజేపీ బలం 257కి పెరగనుందని బసునియా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఇది బసునియా చేసిన రాజకీయ ప్రకటన మాత్రమే కాగా.. ఎంపీల పార్టీ మార్పుపై సంబంధిత ఎంపీలు, పార్టీలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ పరిణామం నిజమైతే లోక్‌సభలో సంఖ్యాబల సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!