
జనరల్

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్‌ను ఆలయ అర్చకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అందజేశారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 19న ఘటోత్సవం, ఆగస్టు 2న ప్రధాన బోనాలు, ఆగస్టు 3న రంగం మరియు గజవాహన ఊరేగింపు నిర్వహించనున్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆలయ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. బోనాల ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే దేవాదాయ శాఖ మంత్రితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లను ఖరారు చేస్తామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!