
రాజకీయాలు

సైబర్ నేరాల నియంత్రణ, డిజిటల్ భద్రత కోసం పనిచేసే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCB) ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయిన ఘటన వెలుగులోకి వచ్చింది. మే 22న జరిగిన ఈ ఘటనను అధికారులు దాదాపు 20 రోజుల పాటు గుర్తించలేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది.
ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సైబర్ భద్రతా సంస్థగా గుర్తింపు పొందిన ఈ బ్యూరో, అనేక కీలక కేసులను ఛేదించింది. అలాంటి సంస్థకే భద్రతా లోపం ఎదురుకావడం పట్ల ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత అధికారులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు. హ్యాకింగ్ ఎలా జరిగింది, ఎలాంటి భద్రతా లోపాలు ఉన్నాయనే విషయాలపై విచారణ కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!