

అమెరికా రాజధానిలోని వైట్‌హౌస్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన జర్నలిస్టుల విందు సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యక్రమంలో పాల్గొన్న వందలాది అతిథులు భయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు ఇతర ప్రముఖులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సంఘటన జరిగిన ప్రదేశాన్ని భద్రతా దళాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టాయి. అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం కాల్పుల్లో ఎవరూ తీవ్రంగా గాయపడలేదు. అయితే దాడి సమయంలో ఒక అధికారికి స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది. నిందితుడి వద్ద పలు ఆయుధాలు ఉన్నట్లు గుర్తించగా, అతడిని కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ ఇది దేశ రాజ్యాంగంపై దాడిగా భావిస్తున్నామని తెలిపారు. కాల్పుల సమయంలో అక్కడ ఉన్నవారు ధైర్యంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకోవడం ప్రశంసనీయమన్నారు. అలాగే గూఢచారి సంస్థలు, పోలీస్ విభాగం సమన్వయంతో సమర్థంగా పని చేశాయని ఆయన అభినందించారు. ఈ ఘటనతో వైట్‌హౌస్ భద్రతా ఏర్పాట్లపై మరోసారి చర్చ మొదలైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!