9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సింగపూర్‌లో ఐటీ ఉద్యోగమంటూ వల..

Writer: Chandrika 07:36 AM, 26 జులై, 2026
సింగపూర్‌లో ఐటీ ఉద్యోగమంటూ వల..

సింగపూర్‌లో ఐటీ ఉద్యోగాలు, నెలకు రూ.1.25 లక్షల వేతనం అంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రకటనలను నమ్మిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన దాదాపు వంద మంది యువత సైబర్‌ ముఠా వలలో చిక్కుకున్నట్లు సమాచారం. బాధితుల్లో గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని రాధారంగానగర్‌కు చెందిన సాయిబాబా, కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన పూర్ణ వెంకటకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన శ్రీరామ్‌ ఉన్నారు. విదేశాలకు తీసుకెళ్లిన తర్వాత వారి పాస్‌పోర్టులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకుని నిర్బంధించినట్లు బాధితులు వెల్లడించారు. వారి నుంచి అందిన సమాచారం ఆధారంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు జులై 17న విదేశాంగ శాఖకు, జులై 22న ఏపీఎన్‌ఆర్‌టీకి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులతో కాన్ఫరెన్స్‌ కాల్‌లో మాట్లాడిన ఏపీఎన్‌ఆర్‌టీ ప్రతినిధులు వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగ ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్న సాయిబాబా, పూర్ణ వెంకటకృష్ణ తదితరులు సింగపూర్‌లో ఉద్యోగం వచ్చిందనే సమాచారంతో ఏప్రిల్‌ 2న విజయవాడ నుంచి బయలుదేరారు. అయితే నియామక ప్రతినిధులు వారిని సింగపూర్‌కు కాకుండా కంబోడియాకు, అనంతరం మయన్మార్‌కు తరలించినట్లు బాధితులు తెలిపారు. అక్కడ మారుమూల ప్రాంతాల్లో నిర్బంధించి బలవంతంగా సైబర్‌ నేరాలు చేయిస్తున్నారని, ఆదేశాలు పాటించకపోతే విద్యుత్తు షాక్‌లు ఇవ్వడం, చీకటి గదుల్లో బంధించడం, ఆహారం ఇవ్వకుండా వేధించడం వంటి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కొందరు యువతులు లైంగిక దాడులకు గురవుతున్నట్లు కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన వారిలో 18 మందిని తిరిగి పట్టుకుని హింసించినట్లు తెలిపారు. తమను విడిచిపెట్టాలంటే ఒక్కొక్కరు రూ.15 లక్షలు చెల్లించాలని ముఠా డిమాండ్‌ చేస్తున్నట్లు బాధితులు వెల్లడించారు. కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, యువతను సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ట్యాగ్లు
మయన్మార్ సైబర్ మోసంసింగపూర్ ఉద్యోగ మోసంతెలుగు యువతసైబర్ ముఠానకిలీ ఐటీ ఉద్యోగాలుకంబోడియా ఉద్యోగ మోసంమానవ అక్రమ రవాణాఏపీఎన్‌ఆర్‌టీఆంధ్రప్రదేశ్ యువతసైబర్ నేరాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..
సినిమాలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...
టెక్నాలజీ

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు
జనరల్

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ
రాజకీయాలు

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్
రాజకీయాలు

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..
జనరల్

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..
జనరల్

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..
సినిమాలు

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ
జనరల్

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం
జనరల్

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!