

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద కొత్త పింఛన్ల కోసం రెండు రోజుల్లోనే దాదాపు 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే మంగళవారం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో ఏపీ సేవా పోర్టల్ సర్వర్ మొరాయించడంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అడపాదడపా పనిచేసినప్పటికీ.. చాలా ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేవలకు అంతరాయం ఏర్పడింది.
కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాలను పొందడానికి ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవా కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో సర్వర్‌పై భారం పెరిగినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తుల ప్రక్రియకు అంతరాయం ఏర్పడి ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!