
సినిమాలు

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ‘రణబాలి’ టీజర్‌ను విడుదల చేసింది. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండను మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో చూపించనున్న ఈ చిత్రం టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!