
జనరల్

ఎస్‌ఐఆర్–2026లో భాగంగా గణన ఫారాలు సమర్పించేందుకు నేటితో గడువు ముగియనుంది. రాత్రి 12 గంటల వరకు ఫారాలను స్వీకరించాలని పోలింగ్ కేంద్ర స్థాయి అధికారులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా ఫారం సమర్పించని వారి పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో లేకపోయే అవకాశం ఉందని అధికారులు సూచించారు.
ఎస్‌ఐఆర్–2026లో రూపొందించనున్న జాబితా భవిష్యత్తులో పౌరులకు కీలకంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తుది ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, తిరిగి కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తే అదనపు ప్రక్రియను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లు గడువులోగా గణన ఫారం సమర్పించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!