
టెక్నాలజీ

నేపాల్‌లోని డోల్పా జిల్లాలో ఉన్న జుపాల్ విమానాశ్రయంలో గురువారం ఉదయం సీతా ఎయిర్ విమానానికి ప్రమాదం తప్పింది. నేపాల్‌గంజ్ నుంచి బయలుదేరిన విమానం ఉదయం 8.25 గంటల సమయంలో ల్యాండింగ్ అవుతుండగా వెనుక కుడివైపు టైరు ఊడిపోయింది. విమానంలో 13 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది కలిపి మొత్తం 16 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఏడుగురు విదేశీయులు ఉన్నారు.
టైరు ఊడిపోయిన అనంతరం విమానం రన్‌వేపైనే ఆగిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. విమానానికి పెద్దగా నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. విమానం రన్‌వేపై ఉండటంతో జుపాల్ విమానాశ్రయంలో కొంతకాలం విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాన్ని పరిశీలించి మరమ్మతులు చేసేందుకు సాంకేతిక నిపుణులను రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!