
జనరల్

సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సంచలన విషయాలను వెల్లడించింది. కస్టడీలో తగిలిన గాయాల కారణంగానే సాయికృష్ణ మృతి చెందినట్లు రిపోర్టులో పేర్కొంది. ఇది సాధారణ అదృశ్యం కేసు కాదని, తీవ్రమైన ఆరోపణలు మరియు అనుమానాస్పద అంశాలు ఉన్న కేసుగా దర్యాప్తులో తేలినట్లు సిట్ వెల్లడించింది.
మృతదేహాన్ని పోలీస్ స్టేషన్‌లో చూసినట్లు ఓ ఎస్‌ఐ తన వాంగ్మూలంలో పేర్కొన్నారని రిపోర్టులో వెల్లడైంది. అలాగే మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీని కావాలనే తొలగించినట్లు సిట్ ఆరోపించింది. మరోవైపు కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజుకు జూలై 8 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!