
రాజకీయాలు

మధ్యప్రదేశ్‌లోని పంధుర్నా జిల్లా కార్ఘాట్ కమ్టీ గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీకి అందజేసిన పోషకాహార లడ్డూల ప్యాకెట్లో చనిపోయిన పాము పిల్ల కనిపించడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వత్సలా బాయి ధుర్వే అనే గర్భిణీకి ఈ ప్యాకెట్‌ను అంగన్వాడీ సిబ్బంది అందజేశారు.
ఇంటికి వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులు ప్యాకెట్‌ను తెరిచి చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. లడ్డూలతో పాటు ప్యాకెట్లో పాము పిల్ల ఉండటంతో తీవ్ర భయం వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, ఆహార భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!