
రాజకీయాలు

ఇటీవలి వరదలకు పర్యావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ఆరోపించింది. ఈ మార్పులకు అమెరికా, చైనా, భారత్‌లే బాధ్యత వహించాలని నేపాల్ మంత్రి పేర్కొన్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో దేశంలో తీవ్ర వరదలు సంభవించాయని, దీనివల్ల భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు.
వరదల కారణంగా ఎదురైన నష్టానికి అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలని నేపాల్ డిమాండ్ చేసింది. వాతావరణ మార్పులకు ప్రధానంగా ఈ మూడు దేశాల చర్యలే కారణమని నేపాల్ ప్రభుత్వం అభిప్రాయపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో బాధితులకు నష్టపరిహారం అందించాల్సిన బాధ్యత కూడా ఆయా దేశాలపైనే ఉందని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!