

సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను వారం రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బుధవారం రాత్రి ఐసీయూకు తరలించినట్లు సమాచారం. 95 ఏళ్ల జానకి ప్రస్తుతం వెంటిలేటర్‌పై వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
1931లో రాజమండ్రిలో జన్మించిన షావుకారు జానకి 1950లో విడుదలైన ‘షావుకారు’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ సినిమా పేరే ఆమెకు ఇంటిపేరుగా మారింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లో నటించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శివాజీ గణేశన్, ఎంజీఆర్, జెమినీ గణేశన్ తదితర దిగ్గజ నటులతో కలిసి పనిచేశారు. కళారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2022లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!