

పాక్ జలసంధిలో చేపల వేటకు వెళ్లే తమిళనాడు మత్స్యకారులు ఇప్పటికీ శ్రీలంక నేవీ అరెస్టుల భయంతో జీవిస్తున్నారు. చేపలు అధికంగా లభించే ప్రాంతాలకు వెళ్లే క్రమంలో జీపీఎస్ సాంకేతిక లోపాల కారణంగా పొరపాటున శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తున్నామని జాలర్లు చెబుతున్నారు. అలాంటి సందర్భాల్లో ఇజ్రాయెల్లో తయారైన అత్యాధునిక డ్వోరా పట్రోల్ నౌకలు రాడార్ సాయంతో వారి పడవలను గుర్తించి వేగంగా చేరుకుని అదుపులోకి తీసుకుంటున్నాయని వారు వాపోతున్నారు. దీంతో సముద్రంలో డ్వోరా నౌక కనిపించగానే జైలుకు వెళ్లాల్సిందేనన్న భయం మత్స్యకారుల్లో నెలకొంది.
రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ఏడాదిలోనే 15కిపైగా ఘటనల్లో 60 మందికి పైగా మత్స్యకారులు అరెస్టయ్యారు. దాదాపు 270 పడవలు ఇప్పటికీ శ్రీలంక అధీనంలోనే ఉండటంతో వందలాది కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయి. అదుపులోకి తీసుకున్న సమయంలో తమపై దుర్వ్యవహారం జరుగుతోందని, జరిమానాలు చెల్లించిన తర్వాత కూడా పడవలను తిరిగి ఇవ్వడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, రాష్ట్ర మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరినట్లు సమాచారం.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!