

రైతు బజార్లు, సూపర్‌మార్కెట్లలో లభించే ఎర్ర క్యాబేజీ నుంచి తీసే ఆంథోసైనిన్ అనే సహజ వర్ణద్రవ్యంతో ‘స్మార్ట్ ఫ్రెష్‌నెస్’ స్టిక్కర్‌ను తయారు చేయవచ్చు. ఎర్ర క్యాబేజీ ఆకులను శుభ్రంగా కడిగి, శుద్ధమైన నీరు, సిట్రిక్ ఆమ్లం మిశ్రమంలో ఉంచడం ద్వారా ఆంథోసైనిన్‌ను సేకరిస్తారు. అనంతరం సెల్యులోజ్ పేపర్ లేదా బయోడీగ్రేడబుల్ పాలిమర్‌ను ఆ ద్రావణంలో ముంచి స్టిక్కర్‌గా ఉపయోగిస్తారు. దీన్ని పనీర్ వంటి ఆహార పదార్థాలపై ఉంచితే వాటి తాజాదనాన్ని రంగు మార్పుల ద్వారా సూచిస్తుంది.
ఆహారం తాజాగా ఉంటే స్టిక్కర్ పసుపు లేదా ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. నాణ్యత తగ్గుతున్న దశలో నారింజ లేదా గులాబీ రంగులోకి, పాడయ్యే స్థితికి చేరుకున్నప్పుడు ఎరుపు లేదా ముదురు రంగులోకి మారుతుంది. చైనాలోని పలు ప్రాంతాల్లో వీటిని వ్యాపారులు వినియోగిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో వీటిని స్మార్ట్‌ఫోన్లతో అనుసంధానించి ఆహార నాణ్యతను పర్యవేక్షించే అవకాశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇది ఆహారం సురక్షితమని తుది నిర్ధారణ చేసే పరికరం కాకుండా స్క్రీనింగ్ సాధనంగా మాత్రమే పరిగణించాలి. ఆహార వ్యర్థాలను తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!