7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీవారి చక్రస్నానం...ఆధ్యాత్మిక విశిష్టత ఇదే

Writer: Pooja 05:29 AM, 23 సెప్టెంబర్, 2026
శ్రీవారి చక్రస్నానం...ఆధ్యాత్మిక విశిష్టత ఇదే

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అధిక మాసం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సెప్టెంబర్ 23, బుధవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం సందర్భంగా వరాహ పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం నిర్వహించనున్నారు. ఎనిమిది రోజుల పాటు వివిధ వాహన సేవల్లో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు తొమ్మిదో రోజు జరిగే ఈ క్రతువుతో ముగుస్తాయి. యజ్ఞం పూర్తయిన అనంతరం నిర్వహించే మంగళస్నానాన్ని అవభృథ స్నానం అంటారని, బ్రహ్మోత్సవాల ముగింపును సూచించే చక్రస్నానం కూడా అదే సంప్రదాయానికి సంబంధించినదని శాస్త్రవచనం.

పురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు కార్తిక మాస శుక్ల చతుర్దశి రోజున కాశీకి వెళ్లి మణికర్ణికా ఘాట్‌లో స్నానం చేసిన అనంతరం వెయ్యి బంగారు తామర పువ్వులతో శివుడిని పూజించాలని సంకల్పించాడు. పూజ సమయంలో శివుడు విష్ణువు భక్తిని పరీక్షించేందుకు ఒక తామర పువ్వును మాయ చేయగా, పువ్వు స్థానంలో తన తామరలాంటి కన్నును సమర్పించేందుకు విష్ణువు సిద్ధపడ్డాడని కథనం. ఆయన భక్తికి మెచ్చిన శివుడు సుదర్శన చక్రాన్ని ప్రసాదించి, అది రాక్షసులను సంహరించే శక్తివంతమైన ఆయుధమని వరమిచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. వైష్ణవ సంప్రదాయంలో సుదర్శన చక్రం ‘చక్రత్తాళ్వార్‌’గా పూజలందుకుంటోంది. వైకుంఠంలోని విరజా నది తిరుమలకు వచ్చి స్వామి పుష్కరిణిగా మారిందని, ముల్లోకాలలోని తీర్థాలన్నీ ఇందులో కలుస్తాయని వరాహ పురాణం పేర్కొన్నట్లు విశ్వాసం. సుబ్రహ్మణ్యస్వామి కూడా ఈ పుష్కరిణిలో స్నానం చేసి బ్రహ్మహత్యా దోషం నుంచి విముక్తి పొందినట్లు స్కంద పురాణంలో వివరించబడిందని చెబుతారు.

చక్రస్నానానికి ముందు శ్రీవారు, ఉభయదేవేరులు, చక్రత్తాళ్వారుకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ధూపదీప నైవేద్యాలు, రాజోపచారాలతో పాటు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో అభిషేకం చేస్తారు. శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం జరిగే ఈ కార్యక్రమం అనంతరం భక్తుల గోవింద నామస్మరణల మధ్య సుదర్శన చక్రత్తాళ్వారుకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కరిణిలో స్నానమాచరిస్తారు. చక్రస్నానాన్ని దర్శించిన వారికి ఐశ్వర్యం, పుణ్యఫలం, అంతిమంగా మోక్షం లభిస్తాయని సంప్రదాయ విశ్వాసం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!

దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..

దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..

అక్రమ అండాల సేకరణపై మహిళా కమిషన్ సీరియస్..

అక్రమ అండాల సేకరణపై మహిళా కమిషన్ సీరియస్..

తీవ్ర పేదరికం నుంచి విముక్తి పొందిన తొలి రాష్ట్రంగా కేరళం..

తీవ్ర పేదరికం నుంచి విముక్తి పొందిన తొలి రాష్ట్రంగా కేరళం..

సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు..

సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు..

ట్యాగ్లు
తిరుమల బ్రహ్మోత్సవాలుచక్రస్నానంవరాహ పుష్కరిణిశ్రీవారి ఆలయంసుదర్శన చక్రంతిరుమల వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌
జనరల్

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌

ఇరాన్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై అమెరికా దాడులు
జనరల్

ఇరాన్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై అమెరికా దాడులు

దీపావళి రోజు ముహూరత్‌ ట్రేడింగ్‌ వేళలివే!
బిజినెస్

దీపావళి రోజు ముహూరత్‌ ట్రేడింగ్‌ వేళలివే!

గ్రామీణ అభివృద్ధి, సంక్షేమమే కూటమి విజయానికి కారణం: పవన్ కళ్యాణ్
రాజకీయాలు

గ్రామీణ అభివృద్ధి, సంక్షేమమే కూటమి విజయానికి కారణం: పవన్ కళ్యాణ్

కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!
జనరల్

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!

దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’లో కొత్త కాస్టింగ్ అప్‌డేట్స్!
గాసిప్స్

దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’లో కొత్త కాస్టింగ్ అప్‌డేట్స్!

షమీకి మరో అవకాశం ఇవ్వాల్సింది- రవిశాస్త్రి
క్రీడలు

షమీకి మరో అవకాశం ఇవ్వాల్సింది- రవిశాస్త్రి

బొండపల్లిలో బొత్స కుమార్తెకు ఓటమి..
రాజకీయాలు

బొండపల్లిలో బొత్స కుమార్తెకు ఓటమి..

‘కిల్లర్’ కోటి రూపాయల కాంటెస్ట్‌లో విజేతలు లేరు..
సినిమాలు

‘కిల్లర్’ కోటి రూపాయల కాంటెస్ట్‌లో విజేతలు లేరు..

తదుపరి 007 ఎంపికపై ఉత్కంఠ.. రేసులో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్!
సినిమాలు

తదుపరి 007 ఎంపికపై ఉత్కంఠ.. రేసులో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్!

శర్వానంద్ ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..

జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాపై ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాపై ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు

అమెజాన్ దీపావళి సేల్‌లో భారీ ఆఫర్లు..
బిజినెస్

అమెజాన్ దీపావళి సేల్‌లో భారీ ఆఫర్లు..

దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..
జనరల్

దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!