
జనరల్

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలకు సంబంధించిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై మెటాలిక్ పెల్లెట్ గన్స్ వినియోగించారనే ఆరోపణలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై విచారణ సందర్భంగా ఇరుపక్షాల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి.
విచారణ సందర్భంగా జూలై 20న మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) అమ్యునిషన్ లాగ్స్‌ను భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. గాయపడిన విద్యార్థులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!