

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను వైద్య పరీక్షలు, చికిత్స కోసం భారీ భద్రత నడుమ ఆస్పత్రికి తరలించారు. అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తీసుకెళ్లిన అధికారులు.. అధిక రక్తపోటు, గుండె, కళ్లకు సంబంధించిన పరీక్షలతో పాటు అవసరమైన చికిత్స అందించారు. వైద్య పరీక్షలు పూర్తైన అనంతరం ఆయనను తిరిగి జైలుకు తరలించారు. మెరుగైన చికిత్స అవసరమైతే ఇమ్రాన్‌ను విదేశాలకు తరలించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు, ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఇమ్రాన్‌ను ఉంచాలని ఆయన కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఖైదీలకు సాధారణంగా జైలులోనే వైద్య సేవలు అందిస్తారని, అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తామని పాక్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిఖ్ ఫజల్ తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలన్న ఇమ్రాన్ ఖాన్ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇతర ఖైదీలకు కూడా వర్తిస్తాయా అనే అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. కొన్నేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!