

జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ అఫ్గానిస్థాన్‌లో ఉన్నాడంటూ పాకిస్థాన్ చేస్తున్న వాదనలను తాలిబన్ ప్రభుత్వం ఖండించింది. అజర్ తమ దేశంలో లేడని అఫ్గాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇతర దేశాలపై దాడులకు అఫ్గాన్ భూభాగాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతించబోమని మరోసారి తేల్చిచెప్పింది. 2019 పుల్వామా దాడి సహా పలు ఉగ్రదాడుల్లో మసూద్ అజర్ కీలక పాత్ర పోషించినట్లు భారత్ ఆరోపిస్తోంది.
అజర్ 2019 మేలో డ్యూరాండ్ లైన్ దాటి అఫ్గానిస్థాన్‌కు వెళ్లిపోయాడని పాకిస్థాన్ పలుమార్లు పేర్కొంటోంది. ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోవాలన్న అంతర్జాతీయ ఒత్తిడి, ఉగ్రవాదానికి నిధుల సరఫరాను అరికట్టడంలో ఎదురైన విమర్శల నేపథ్యంలో పాకిస్థాన్ ఈ వాదన చేస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఉగ్రవాద నిధుల నియంత్రణలో లోపాల కారణంగా పాకిస్థాన్ 2018 నుంచి 2022 వరకు ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో ఉంది. అయితే అజర్ తమ దేశంలో లేడని కాబూల్ స్పష్టం చేయడం పాకిస్థాన్ వాదనలపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!