

బిగ్‌బాస్ 10 హౌస్‌లో ఈరోజు జరగనున్న హైరిస్క్ జోన్ టాస్క్ ఆసక్తిని పెంచుతోంది. రెండు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరిని హైరిస్క్ జోన్‌లోకి పంపాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఈ వారంలో ఎప్పుడైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశాడు. ఎలాంటి వాదనలు, చర్చలు లేకుండానే బ్లూ టీమ్ నుంచి రామ్ ప్రసాద్ హైరిస్క్‌లోకి వెళ్లేందుకు స్వచ్ఛందంగా అంగీకరించాడు. తన నిర్ణయానికి కారణం ఏంటని బిగ్‌బాస్ అడగగా.. శనివారం చెబుతానని రామ్ ప్రసాద్ సమాధానం ఇచ్చాడు. దీంతో తమ టీమ్ తరఫున రామ్ ప్రసాద్‌ను హైరిస్క్‌లో ఉంచుతున్నట్లు నరేశ్ ప్రకటించాడు.
మరోవైపు రెడ్ టీమ్ నుంచి చరణ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు రోహిత్ వెల్లడించాడు. అయితే అంతకుముందే త్రిగుణ్.. రోహిత్ హైరిస్క్‌లోకి వెళ్లడని టీమ్ సభ్యులతో చెప్పడం చర్చనీయాంశమైంది. చివరకు రోహిత్‌కు బదులుగా చరణ్ హైరిస్క్ జోన్‌లోకి వెళ్లాడు. అనంతరం ‘హైరిస్క్‌లో ఉంటాను.. అక్కడి నుంచి ఎలాగైనా బయటకు వస్తా’ అంటూ రామ్ ప్రసాద్ బిగ్‌బాస్ ముందు భావోద్వేగానికి గురయ్యాడు. చరణ్‌తో మాట్లాడిన రోహిత్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ.. ఒక్కరు తనకు మద్దతుగా నిలిచినా చరణ్ కోసం తాను పోరాడేవాడినని చెప్పాడు. దీంతో హౌస్‌లో ఒక్కసారిగా భావోద్వేగ వాతావరణం నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!