

వీబీజీ రామ్‌జీ చట్టం-2025 ప్రభావాలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం సచివాలయంలో జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త చట్టం ప్రభావం గురించి విస్తృతంగా చర్చించారు. గ్రామీణ ఉపాధి అవకాశాలను కాపాడటం, రాష్ట్రాల హక్కులను పరిరక్షించడమే ప్రధాన లక్ష్యమని సభ్యులు స్పష్టం చేశారు.
కొత్త చట్టంలో ప్రతిపాదించిన 60 రోజుల ఉపాధి విరామం, రాష్ట్రాలపై 40 శాతం అదనపు ఆర్థిక భారం మోపడం వంటి అంశాలపై సబ్ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి గాంధీజీ పేరును తొలగించడాన్ని కూడా సముచితం కాదని పేర్కొంది. చట్టాన్ని న్యాయపరంగా, రాజ్యాంగపరంగా సవాల్ చేసే అవకాశాలను పరిశీలించడంతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, జార్ఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!