

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు, బాక్సర్లు, షూటర్ల జోరు కొనసాగుతోంది. మహిళల షాట్‌గన్‌లో నీరూ ధండా స్వర్ణ పతక రేసులో నిలవగా, 4x100 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో భారత బృందం ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో భారత్ మరో పతకానికి చేరువైంది. బాక్సర్ల పంచ్‌తో మరో మూడు పతకాలు ఖరారయ్యాయి. అయితే గత మూడు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రీక్వార్టర్‌ఫైనల్లోనే పరాజయం పాలైంది.
కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగం ప్రీక్వార్టర్‌ఫైనల్లో 14 ఏళ్ల కొరియా ఆర్చర్ కాంగ్ యోన్‌సియో 150కి 150 పాయింట్లు సాధించి జ్యోతి సురేఖను ఓడించింది. జ్యోతి 146 పాయింట్లకే పరిమితమైంది. మరో రౌండ్-16 పోరులో తెలుగు యువ ఆర్చర్ చికిత తానిపర్తి, తైపీకి చెందిన చెన్ యీ సువాన్ 148 పాయింట్లతో సమంగా నిలిచారు. అనంతరం జరిగిన షూటౌట్‌లో చికిత విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో గణేశ్ మణిరత్నం 149-148తో సహచరుడు సాహిల్ జాదవ్‌పై విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!