27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేపాల్‌ వరద బాధితుల సహాయానికి తెలంగాణ ప్రభుత్వ సమన్వయం కొనసాగింపు

Writer: Nithish 07:45 PM, 27 ఆగస్టు, 2026
నేపాల్‌ వరద బాధితుల సహాయానికి తెలంగాణ ప్రభుత్వ సమన్వయం కొనసాగింపు

నేపాల్‌, పరిసర ప్రాంతాల్లో వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్‌, సమన్వయ కేంద్రంతో పాటు హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయం హెల్ప్‌లైన్‌ ద్వారా కుటుంబ సభ్యులు, ఇతరుల నుంచి వచ్చిన సమాచారాన్ని సేకరించి పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 80–100 కాల్స్‌ అందగా, ధ్రువీకరణ అనంతరం 20 కేసుల్లో 23 మందికి సంబంధించిన వివరాలను తదుపరి చర్యల కోసం గుర్తించారు. వీరిలో ఆరుగురు తెలంగాణకు చెందినవారు కాగా, 17 మంది తెలంగాణ మూలాలున్న ఎన్‌ఆర్‌ఐలు. కైలాస మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సురక్షితంగా ఉన్నట్లు తాజాగా నిర్ధారణ అయింది.

దీంతో మిగిలిన 22 మంది క్షేమ సమాచారం, ఆచూకీపై అధికారులు నిరంతరం ఫాలోఅప్‌ చేస్తున్నారు. నేపాల్‌–టిబెట్‌ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న పలువురి చివరిగా తెలిసిన ప్రదేశాలు రసువా, రసువాగఢి, గ్యిరోంగ్‌గా గుర్తించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్‌ అధికారులు, రాష్ట్ర సచివాలయం, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయం, ఇతర సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, ట్రావెల్‌ ఆపరేటర్లు, అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని ధ్రువీకరిస్తూ, అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని

ట్యాగ్లు
నేపాల్ వరదలుతెలంగాణ ప్రభుత్వంతెలంగాణ భవన్వరద బాధితులుసహాయక చర్యలుతెలంగాణ యాత్రికులుకైలాస మానస సరోవర్ యాత్రరేవంత్ రెడ్డినేపాల్ టిబెట్ఆపదలో సహాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం
జనరల్

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!
క్రీడలు

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌
క్రీడలు

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌
క్రీడలు

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌
జనరల్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం
జనరల్

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!
సినిమాలు

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?
జనరల్

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్
సినిమాలు

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!