

సచివాలయంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టెలివిజన్ అవార్డు కమిటీతో సమావేశమై రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టనున్న టీవీ అవార్డులపై సమగ్రంగా చర్చించారు. అవార్డుల కేటగిరీలు, ప్రత్యేక లోగో, మార్గదర్శకాలు, అవార్డుల పేరు, వేదిక వంటి అంశాలను కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎఫ్డీసీ ఎండీ ముకుంద రెడ్డి, కమిటీ చైర్మన్తో పాటు సభ్యులు పాల్గొన్నారు.
టెలివిజన్ రంగం వినోదంతో పాటు మంచి సందేశాలను సమాజానికి చేరవేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎక్కువగా టీవీ కార్యక్రమాలను వీక్షిస్తున్నారని, అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచే కళాకారులు, మంచి సందేశాత్మక సీరియల్స్, టీవీ కార్యక్రమాలు, బాలల చిత్రాలను ప్రోత్సహించేలా అవార్డులు ఉండాలని చెప్పారు. అవార్డులకు పి.వి. నరసింహారావు పేరు పెట్టే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని తెలిపారు. తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే లోగో, పేరుతో పాటు పూర్తిస్థాయి పారదర్శకతతో అవార్డుల ఎంపిక జరగాలని కమిటీకి సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!