

చైనాలోని మోకిలో జరుగుతున్న మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ అదరగొట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో కొరియాను 5-1తో ఓడించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. డ్రాగ్‌ఫ్లిక్ నిపుణురాలు సుప్రియా అద్భుత ప్రదర్శనతో హ్యాట్రిక్ సాధించింది. 17వ, 33వ, 56వ నిమిషాల్లో గోల్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. మధు సిదర్ 13వ నిమిషంలో, సుఖ్‌వీర్ కౌర్ 21వ నిమిషంలో చెరో గోల్ చేశారు. కొరియా తరఫున యూరి జియాంగ్ 41వ నిమిషంలో ఏకైక గోల్ సాధించింది.
మరో సెమీఫైనల్లో చైనా 6-0తో జపాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఆదివారం జరిగే మహిళల టైటిల్ పోరులో భారత్, చైనా తలపడనున్నాయి. మరోవైపు పురుషుల జూనియర్ ఆసియా కప్‌లోనూ డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. పురుషుల ఫైనల్లో భారత్ కొరియాతో తలపడనుంది. ఒకే రోజు పురుషుల, మహిళల విభాగాల్లో టైటిల్ కోసం భారత్ బరిలోకి దిగనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!