
జనరల్

తెలంగాణలో ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించనున్న టెట్-2026 పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మూడు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. సెప్టెంబర్ 8న తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 9న మిగతా మాధ్యమాలకు సంబంధించిన పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 24,983 మంది ఇన్‌సర్వీస్ టీచర్లు హాజరుకానున్నారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలని అధికారులు సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!