27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి

Writer: Nithish 06:39 AM, 27 సెప్టెంబర్, 2026
తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జనగామలో శనివారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు, మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. రూ.45 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. తొలి దశలో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, దసరా నాటికి 2.18 లక్షల ఇళ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కేంద్రం నుంచి నిధుల కోసం ఎదురుచూడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తోందని మంత్రి తెలిపారు. రెండో దశలోనూ పెద్ద సంఖ్యలో ఇళ్లను కేటాయించి అర్హులైన పేదలకు ప్రయోజనం కల్పిస్తామని చెప్పారు. గతంలో ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూమిలో పంపిణీ కాని ప్లాట్లను అర్హులకు అందించడంతోపాటు, వాటిపై ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

ట్యాగ్లు
ఇందిరమ్మ ఇళ్లుపొంగులేటి శ్రీనివాసరెడ్డితెలంగాణ ప్రభుత్వంజనగామగృహ నిర్మాణంపేదల ఇళ్లుఇందిరమ్మ ఇండ్లుతెలంగాణ హౌసింగ్గృహప్రవేశంఅభివృద్ధి పనులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌
జనరల్

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌
జనరల్

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి
జనరల్

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!