

ఇంధన రంగ మౌలిక వసతులపై పరస్పర దాడులను నిలిపివేసేందుకు రష్యా, ఉక్రెయిన్‌లు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్.. రష్యా ఇంధన మౌలిక వసతులపై దాడులను నిలిపివేయాలని గతంలో ఉక్రెయిన్‌ను కోరిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే ట్రంప్ ప్రకటనపై రష్యా, ఉక్రెయిన్ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. ఇంధన మౌలిక వసతులపై దాడులను నిలిపివేయాలన్న ట్రంప్ పిలుపును రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ మాత్రం స్వాగతించింది.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా డీజిల్ ధరలు పెరగడానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధమే ప్రధాన కారణమని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధం కారణం కాదని స్పష్టం చేశారు. అమెరికాలో గ్యాలన్ డీజిల్ ధర 6 డాలర్లకు చేరింది. రష్యా శుద్ధి కార్యకలాపాల్లో అంతరాయాలు, గల్ఫ్ దేశాల ఎగుమతులు తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణమని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది. ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యా ముడి చమురు శుద్ధి సామర్థ్యం సుమారు 30 శాతం తగ్గినట్లు సమాచారం. ఇంధన మౌలిక వసతులపై దాడులు ఆగితే ధరలు తగ్గే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!