
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాష్ట్రంలోని పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచన జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!