

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహం అందించేందుకు సిద్ధమవుతోంది. స్వదేశ్ దర్శన్ 2.0లోని 'ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్' పథకం కింద తిరుపతి, విశాఖపట్నంను సమగ్ర పర్యాటక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఎంపికైతే ఒక్కో నగరానికి ఐదేళ్లలో రూ.500 కోట్ల చొప్పున నిధులు అందనున్నాయి. 50 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి పర్యాటక సదుపాయాలు, డిజిటల్ సేవలు, భద్రత, వసతి, ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
గోవా రోడ్మ్యాప్లోని గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, నైపుణ్యాభివృద్ధి, పర్యాటక ఎంఎస్ఎంఈలు, డెస్టినేషన్ మేనేజ్మెంట్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాజెక్టులను అమలు చేయనున్నారు. తిరుపతిలో ఇప్పటికే అవసరమైన భూమిని గుర్తించగా, విశాఖలో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. స్థానిక ప్రజల భాగస్వామ్యం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!