

మొదట్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. సహచరుల సహకారంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. అవసరమైన సమయంలో అనుకూల సహాయం లభిస్తుంది. ఇష్టదేవతా శ్లోక పఠనం శుభప్రదంగా ఉంటుంది.
పరిస్థితులు అనుకూలంగా మారి శుభవార్తలు వినే అవకాశం ఉంది. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రతిభ, కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో అనుభవజ్ఞుల సూచనలు ఉపయోగపడతాయి. ప్రారంభించిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. శ్రీశివపార్వతుల ఆరాధన శుభప్రదంగా ఉంటుంది.
మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విశ్రాంతికి కూడా తగిన సమయం కేటాయించడం మంచిది. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.
కొన్ని ఆటంకాలు ఎదురైనా ఓర్పుతో వాటిని అధిగమిస్తారు. శారీరక అలసట పెరగకుండా పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలి. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం అవసరం. చంద్రశేఖర అష్టకం పఠించడం మేలు చేస్తుంది.
ప్రశాంతమైన ఆలోచనలతో వ్యవహరించి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దుర్గా స్తోత్ర పఠనం మేలు చేస్తుంది.
ఆత్మస్థైర్యంతో వ్యవహరించి క్లిష్టమైన పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటారు. ఒక శుభవార్త మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. శివ అష్టోత్తర శతనామావళి పఠనం శుభప్రదంగా ఉంటుంది.
అవసరమైన సమయంలో సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులు, బంధువులతో అనుబంధాలు మరింత బలపడతాయి. ప్రారంభించిన కార్యక్రమాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. ఇష్టదైవ దర్శనం మేలు చేస్తుంది.
మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభ, సామర్థ్యానికి ప్రశంసలు అందుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన విషయాలను పంచుకుంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. శని ధ్యానం శ్రేయస్కరం.
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. మిత్రుల సహకారం, ప్రోత్సాహం మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. సూర్యారాధన శుభప్రదంగా ఉంటుంది.
పనిభారాన్ని సమర్థంగా నిర్వహించుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో మితవ్యయం పాటించడం మంచిది. ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పోటీ పరిస్థితుల్లో మీకు అనుకూలత ఏర్పడుతుంది. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
ఆర్థికంగా అనుకూల పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి. భవిష్యత్తు లక్ష్యాల సాధన దిశగా ముందడుగు వేస్తారు. గృహ సంబంధిత వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గాదేవి ధ్యానం శుభప్రదంగా ఉంటుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!