

శ్రీశైలం జలాశయం సమీపంలో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. జలాశయం వద్ద ఉన్న మలుపు దగ్గర టూరిస్ట్ బస్సు డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కకు తీసే ప్రయత్నంలో మట్టిలో ఇరుక్కుపోవడంతో బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. దీంతో శ్రీశైలం వైపు వెళ్లే వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ ట్రాఫిక్ జామ్ జలాశయం ప్రాంతం నుంచి దోమలపెంట ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వరకు, మరోవైపు సుండిపెంట వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర కొనసాగింది. రహదారి ఇరుకుగా ఉండటంతో బస్సును పక్కకు తొలగించే వరకు ఇతర వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోయింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సును బయటకు తీసేందుకు స్థానికులు, వాహనదారులు కలిసి ప్రయత్నాలు చేపట్టారు. ఘటన తెలంగాణ ప్రాంత పరిధిలో జరిగినప్పటికీ అధికారులు స్పందించడంలో ఆలస్యం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!